Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి

ప్రయివేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి

- Advertisement -

అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు భుజంగరావు 
నవతెలంగాణ-కంఠేశ్వర్ 

ప్రయివేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి అని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు భుజంగరావు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు భుజంగరావు అధ్యక్షతన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం సాయంత్రం ఏడు గంటలకు అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ భుజంగరావు  మాట్లాడుతూ.. ప్రైవేటుగా ఆరోగ్య సేవలను అందించాలనుకునే ఏ విభాగపు ఆసుపత్రులైన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే అన్ని నియమా నిబంధనలకు అర్హతలను పరిశీలించి తాత్కాలిక రిజిస్ట్రేషన్ మొదటగా ఇవ్వబడునని, సంవత్సరం తర్వాత ఐదు సంవత్సరాల వరకు అర్హత ఉండే శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందన్నారు.

ప్రతి ఆస్పత్రి లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను డిస్ప్లే చేయాలని, అదేవిధంగా సర్వీస్ చార్జీలను, టారీప్ బోర్డులను ఆసుపత్రులలో ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ ఆర్ఎంపీ, పిఎంపీల ద్వారా రిఫరల్ వ్యవస్థను కొనసాగించే ఆస్పత్రులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఆస్పత్రిలో నియమ నిబంధనల కనుగునంగా అర్హులైన వైద్యులు, అర్హులైన సిబ్బంది మాత్రమే పనిచేయాలని, అనర్హత కలిగిన వారు ఎటువంటి ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదన్నారు.

ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ రాజశ్రీ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నిజాంబాద్ పేరుపైన డిడి రూపంలో ఫీజు చెల్లించవలసి ఉంటుందని ఈ ఫీజు ఆసుపత్రుల లో బెడ్ల సంఖ్య, ప్రాంతాన్ని బట్టి మెట్రో ,అర్బన్, రూరల్ కు అనుగుణంగా ఫీజు నిర్ధారించ పడుతుందన్నారు.రీజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే డిసిగ్నేటెడ్ ఇన్స్పెక్షన్ అధికారి చేత చెక్లిస్ట్ ద్వారా నియమ నిబంధనలు కనుగుణంగా అన్ని అర్హతలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేసిన తర్వాతనే ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనికి ప్రైవేట్ ఆసుపత్రిల యజమానులందరూ జిల్లా యంత్రాంగంతో సహకరించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు లేనిచో ,ఏవైనా లోటుపాట్లు ఉంటే ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాలకు అనుగుణంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని సందర్భంగా తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఉపా వైద్యాధికారులు డాక్టరు విద్య ,డాక్టర్ రవీందర్, డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిఖర ,బోధన్ ఐఎంఏ అధ్యక్ష ,కార్యదర్శులు మకరంద ,నాగనాథ్, డిప్యూటీ డెమో దుర్గారావు , వేణుగోపాల్, సురేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -