అదనపు వరకట్నం.. కేసు నమోదు

నవతెలంగాణ – జమ్మికుంట
అదనపు వరకట్నం తీసుకురమ్మని వేధించిన భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ఒరగంటి రవి తెలిపారు. పట్టణ సీఐ తెలిపిన వివరాల జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్రు లక్ష్మిప్రసన్న భర్త పేరు ప్రణీత్ కుమార్ 27 సంవత్సరాలు    తనకు 2018 లో నా తల్లిదండ్రులు కర్రు ప్రణీత్ కుమార్  28 సంవత్సరాలు  గ్రామం గోదావరిఖని అతనితో పెళ్లి పెళ్లి జరిపించాలని తెలిపారు. పెళ్లి సమయంలో అన్ని లాంఛనాలతో పెట్టి పెళ్లి జరిపారు. ఆమెకు మూడు సంవత్సరాల పాప కలదు.  భర్త పెళ్లి అయినాక 1 సంవత్సరం వరకు బాగానే చూసుకున్నారు .తరువాత తనకు అధికంగా50 లక్షల కట్నం కావాలని రోజు తాగి వచ్చి ఆమెను సతాయించేవాడు. అత్త మామలకు చెప్పిన వారు కూడా నా భర్తకే సపోర్ట్ చేసేవారు. కట్నం తెస్తేనే నా ఇంటికి రా అని కొట్టి వెలగొట్టినాడు. అప్పటినుండి కర్రు ప్రసన్న కూతురును తీసుకొని జూన్ 2023 నుండి ఆమె తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. అదనపు కట్నం తెమ్మని వేధించిన  భర్త ,అత్తమామలపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కర్రు ప్రసన్న దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ఒరగంటి రవి తెలిపారు.
Spread the love