అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట నుండి వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పట్టణ సీఐ ఒరగంటి రవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి , బ్లూ కోల్ట్ సిబ్బంది సం యుక్తంగా మంగళవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన దోమటి రాజు  అనునతడు  వల్బాపూర్ గ్రామంలో బెల్ట్ షాపు  నడుపుతూ ,జమ్మికుంట నుండి అక్రమంగా తరలించుచున్న( 20) రాయల్ స్టాక్ క్వార్టర్స్ ,(18) ఇంపీరియల్ బ్లూ క్వార్టర్స్, మూడు బ్లెండర్స్ ప్రైడ్ కోటర్స్ ,మొత్తము (41)  కోటర్స్ దాని విలువ సుమారు 8430 రూపాయలు విలువగల మధ్యం పట్టుకున్నట్లు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ తెలిపారు.
Spread the love