రేపే నారా లోకేశ్ యువగళం పునఃప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్: అధినేత చంద్రబాబునాయుడు జైలు నుంచి విడుదల కావడంతో టీడీపీ తన కార్యకలాపాలు ముమ్మరం చేయాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత యువగళం నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో యువగళం పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రేపు (నవంబరు 27) కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేపట్టనున్నారు. తద్వారా మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. యువగళం పాదయాత్ర మళ్లీ మొదలవుతోందన్న వార్తతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్ర జనవరి 27న కుప్పంలో ప్రారంభమైంది. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ సంకల్పించారు. ఇప్పటివరకు లోకేశ్ 209 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 2852.4 కి.మీ. దూరం నడిచారు.

Spread the love