సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట

నవతెలంగాణ – ఢిల్లీ : సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట లభించింది. శివసేన వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఏక్ నాథ్ షిండే చీఫ్ విఫ్ నియామకం చెల్లదని, అది చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్టీలో విభేదాలను పార్టీలోనే పరిష్కరించుకోవాలి తప్ప గవర్నర్ జోక్యం తగదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. పార్టీ విభేదాలను ప్రభుత్వంపై రుద్దకూడదని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమకోహ్లి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తొలుత ఏక్‌నాథ్ షిండే సుప్రీంను ఆశ్రయించారు. షిండేతో ప్రమాణ స్వీకారం, బల నిరూపణకు ఆదేశిస్తూ గవర్నర్ చేపట్టిన చర్యను సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సైతం సుప్రీంను ఆశ్రయించారు.

Spread the love