భారత ప్రజలందరి ప్రేమాభిమానాలను చోరగొన్న వ్యక్తి సుందరయ్య

    ఆయన ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే ప్రియతమమైన నాయకుడు కాదు. దేశభక్తులైన, స్వాతంత్ర్య పిపాస కలిగిన భారత ప్రజలందరి ప్రేమాభిమానాలను ఆయన చేరగొన్నారు. ఆయన అచంచలమైన మార్క్సిస్టు-లెనినిస్టు.ఆయన ఆదర్శప్రాయమైన త్యాగనిరితి, నిరాడంబరత ఆయనకు గౌరవమన్ననలను సంపాదించిపెట్టాయి. భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖ నాయకునిగానే కాకుండా, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యున్నత స్థాయి నాయకులలో ఒకరిగా చరిత్రలో సుందరయ్య నిలిచిపోతారు.వర్గబానిసత్వం నుండి ప్రజలను విముక్తి చేసే ఆశయానికి కట్టుబడి ఉన్నవారు కనుక కమ్యూనిస్టులు స్వభావరీత్యానే మానవతావాదులు. ఐతే మాలో చాలామంది కమ్యూనిస్టుల కంటే ఎక్కువ మానవతావాదిగా చాలా సందర్భాలలో నా మనస్సును చేరగొన్నారు సుందరయ్య. ఆదర్శప్రాయమేన రీతిలో స్వీయావసరాలను త్యాగం చేయగలిగేవారు ఆయన. కాని ఇతర కామ్రేడ్స్ విషయం వచ్చినప్పుడు సుందరయ్య అత్యంత కరుణా హృదయంతో ఉన్న పరిస్థితులలో చేయగలిగినదంతా చేసేవారు. పార్టీ కేడర్ పట్ల ఆయన ప్రేమ సాటి లేనిది. ఈ విశిష్ట లక్షణాన్ని చాలామంది మార్క్సిస్టు-లెనినిస్టు నాయకులు కామ్రేడ్ సుందరయ్య నుండి నేర్చుకోవలసి ఉంది.

                                                                                                                                                          –కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య.

Spread the love