జోహర్లు కామ్రేడ్ సుందరయ్యా!


ప్రపంచ విప్లవ యోధా!
వందనం.. విప్లవాభివందనం!!
దేహ త్యాగంచేసి ముఫ్పై ఎనిమిదేండ్లు అయినా
మీ రేసిన సైద్ధాంతిక త్రోవ…
మాకో నిత్య దారి దీపం!!
గాంధీ హంతకులే  గద్దెనెక్కి
మతాన్ని – గారడీ వాగ్థానాల్ని – భ్రమల్ని  కల్పిస్తూ
ధనికుల సేవ చేస్తున్నారీ
వజ్రోత్సవ భారతిన ..
కార్మిక – శ్రామిక – రాజ్యస్థాపనే ధ్యేయంగా
జనతా ప్రజాతంత్ర విప్లవ లక్ష్యంకై
ఐక్యపోరాటోద్యమాల దశగా
మీ ఆశయాల సాఫల్యతకై
సామ్యవాద దిశగా సాగుతాం…

– తంగిరాల చక్రవర్తి
9393804472

Spread the love