నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని కోతులారం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా జన వాసాలకు దగ్గరగా నిర్మాణం చేపడుతున్న కోళ్ల ఫారం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం గ్రామ ప్రజలు ఎంపీడీవో విజయ్ భాస్కర్ కు వినతి పత్రమును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండ్ల పక్కనే కోళ్ల ఫారం ను నిర్మాణం చేస్తే కోళ్ల ఫారం నుండి వచ్చే ఈగలతో ప్రజలు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. తక్షణమే నిర్మాణం చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామ ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈ మాజీ సర్పంచ్ జక్కల లోకేష్ , బంగారు రవి , అంజయ్య , బాలరాజు , యాదయ్య , వెంకటేశ్ , ఉపేందర్ , నరసింహ్మ , జంగయ్య తదితరులు ఉన్నారు.