నవతెలంగాణ కథనానికి స్పందన.. మండలాభివృద్ధికి నిధులు మంజురు

– బస్టాండ్ సమీపంలో మరుగుదొడ్లు మూత్రశాలల నిర్మాణం 
– ఎమ్మెల్యే కృషితో రూ.4 లక్షల నిధులు మంజూరు
– జిపి ప్రత్యేక అధికారి డాక్టర్ విజయ్ వెల్లడి
నవతెలంగాణ మద్నూర్: మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో ప్రయాణికులకు మరుగుదొడ్లు మూత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నట్టు ఇటీవల నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్పందించి ప్రత్యేక కృషితో బస్టాండ్ సమీపంలో మరుగుదొడ్లు మూత్రశాలలు నిర్మాణాలకు నాలుగు లక్షల నిధులు మంజూరు చేయించినట్లు మద్నూర్ పంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ బండి వార్ విజయ్ గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.


భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన ప్రయాణికుల కోసం మద్నూర్ పాత బస్టాండ్ లో మరుగుదొడ్లు మూత్రశాలలు నిర్మించక పోవడం ప్రయాణికుల ఇబ్బందుల పట్ల పంచాయతీ పాలకవర్గాలు మారిన రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన రద్దీగా ఉండే బస్టాండులో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక ముఖ్యంగా ఆడపడుచులు చుట్టుపక్కల కార్యాలయాల కాంపౌండ్ వాళ్ళ పక్కకు వెళ్లి మూత్రం చేయవలసిన దుస్థితి ఏర్పడుతుందని నవ తెలంగాణ ప్రత్యేకంగా కథనం ప్రచురించడం ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు స్పందించి ప్రత్యేక కృషి చేసి పాత బస్టాండ్ లో ప్రయాణికుల కోసం మరుగుదొడ్లు మూత్రశాల నిర్మాణానికి నాలుగు లక్షల నిధులు మంజూరు చేయించడం గ్రామస్తులు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు

Spread the love