నవతెలంగాణ కథనానికి స్పందన

– డబుల్ బెడ్ రూమ్ అక్రమ వసూళ్ల డొంక కదులుతుంది
– పోలీస్ స్టేషన్ కు చేరిన అక్రమ డబ్బుల వసుళ్ళ దరఖాస్తు
నవతెలంగాణ – మద్నూర్
నవతెలంగాణ వెబ్ లో రెండు రోజుల క్రితం ప్రచురితమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరులో అక్రమ వసూళ్ల కథనంతో డొంక కదులుతోంది. మద్నూర్ మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు కోసం ఒక్కొక్క గ్రామంలో ఒకరకంగా లబ్ధిదారుల నుండి కాంట్రాక్టర్ల పేరుతో వేలాది రూపాయల చొప్పున అక్రమ వసూళ్లు జరిగిన వాటిపై నవతెలంగాణ పరిశీలనాత్మకంగా పలు గ్రామాలను సందర్శించి, జరిగిన అక్రమాల పైన పెద్ద మొత్తంలో లక్షలాది రూపాయలు అక్రమాలు జరిగినట్లు ప్రచురించిన వార్తకు లబ్ధిదారుల్లో చలనం కదలిక మొదలైంది. మద్నూర్ మండలంలోని పెద్ద తడుగూర్ గ్రామానికి చెందిన షేక్ నజియా భర్త మహబూబ్ అనే మహిళ అదే  గ్రామానికి చెందిన ఒక నాయకుడు ముప్పిడి వార్ శ్రీనివాస్ తండ్రి నాగనాథ్ అనే వ్యక్తికి దాదాపు 15 నెలల క్రితం రూ.10000 రూపాయలు ఇచ్చినట్లు, పదివేల రూపాయలు తీసుకున్న ఆ వ్యక్తి నాకు డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయించలేదని నా డబ్బులు నాకు ఇవ్వమని అడుగుతే వాయిదాలు పెడుతూ,  తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు కోసం తీసుకున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని శనివారం నాడు మద్నూర్ పోలీస్ స్టేషన్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మద్నూర్ పోలీసులకు నవ తెలంగాణ అడిగి తెలుసుకోగా ఫిర్యాదు చేసిన మాట నిజమేనని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Spread the love