నవతెలంగాణ కథనానికి స్పందన

– వాటర్ ట్యాoక్ శుభ్రం చేయించిన అధికారులు
నవతెలంగాణ-మల్హర్ రావు : మిషన్ భగీరథ నీటిలో జలగ, అనే కథనం ఈనెల 6న నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ టాప్లాయిడ్ లో ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనానికి రుద్రారం గ్రామపంచాయతీ అధికారులు,మిషన్ భగీరత అధికారులు,సిబ్బంది ఎట్టకేలకు స్పందించారు.గ్రామానికి సరఫరా అవుతున్న వాటర్ ట్యాoక్ ను బ్లీచింగ్ పౌడర్ తో పరిశుభ్రం చేశారు.ఇందుకు గ్రామస్తులు నవ తెలంగాణ దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love