రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేపు ప్రమాణం చేయనున్న క్రమంలో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు రేవంత్ రెడ్డి. నవంబర్ 30వ తేదీన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రేవంత్ గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యేలు కొనసాగాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.

Spread the love