
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అతి త్వరలో అధికారికంగా ప్రారంభం కానున్న మండల కేంద్రంలోని నూతన విద్యా వనరుల కేంద్రం విధి విధానాలు, నిర్వాహణపై స్థానిక వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఆళ్ళపల్లి మండల విద్యాశాఖాధికారి పి.కృష్ణయ్య శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. విద్యాశాఖ తరుపున ఎమ్.ఆర్.సీకి అవసరమైన సిబ్బంది ఇద్దరిని కేటాయించడం జరిగిందన్నారు. రెండు కంప్యూటర్ లను సైతం అందివ్వడం జరిగిందని చెప్పారు. అతిత్వరలో విద్యాపరమైన కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ఈ నూతన భవనంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎం.ఆర్.సీ కేంద్రానికి అత్యవసర వస్తు సామాగ్రిని స్వచ్చందంగా ముందుకొచ్చి సమకూర్చిన ఉపాధ్యాయ దాతలకు ఎంఈఓ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళపల్లి, అనంతోగు, మర్కోడు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కె.శాంతారావు, బి.బావుసింగ్, బి.బాబులాల్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జోగా రాంబాబు, చాట్ల శ్రీనివాసరావు, ఇస్లావత్ హతిరామ్, ఇస్లావత్ నరేష్, భూక్యా రమేష్, సీఆర్ పీ సునీత, ఎంఆర్ సీ సిబ్బంది పాల్గొన్నారు.