Monday, May 11, 2026
E-PAPER
Homeమానవిసౌందర్యపోషకాలు మెండు…

సౌందర్యపోషకాలు మెండు…

- Advertisement -

మెంతులు వ్రతి వంటగదిలో ఉండే పదార్ధం. ఇది ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవేంటో చూద్దాం.
చర్మ మలినాలను తొలగిస్తుంది: మెంతులను రాత్రంతా నానబెట్టి గ్రైండ్ చేసి మరుసటి రోజు ముఖానికి రాసుకుంటే ఆయిల్ డ్రైనింగ్ తొలగిపోయి చర్మ రంద్రాల్లో పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోతుంది.
చుండ్రుకు చికిత్స చేస్తుంది: మెంతుల్లో యాంటీ ఫంగల్ గా బాగా ఉపయోగపడుతుంది. మెంతులనే పొడిచేసి అందులో పెరుగు కలిపి తలకు రాసుకుని తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది.
గ్రే హెయిర్ గ్రోత్‌ను నివారిస్తుంది: మెంతుల్లో పొటాషియం 20 ఏళ్ల వయసులో తెల్లజుట్టు పెరగకుండా చేస్తుంది. నానబెట్టిన మెంతి గింజలను గ్రైండ్ చేసి అందులో పెద్ద ఉసిరికాయ రసాన్ని కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టించి తలస్నానం చేయండి. తెల్ల జుట్టును నివారించండి.
మెరిసే ముఖం: మెంతుల్లో విటమిన్ సి ఉంటుంది, ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. మెంతుల్లో పాలు కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది.
ముఖం ముడుతలను తొలగిస్తుంది: మెంతులను గ్రైండ్ చేసి, ముఖంపై రుద్దడం వల్ల ముఖ చర్మం బిగుతుగా మారి ముడతలు తొలగిపోతాయి. కోల్పోయిన యవ్వనాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -