మండలంలోని బషీరాబాద్ గ్రామంలో సోమవారం రోడ్డు శుద్ధి కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా సావా (రథం) దేవుడు తిరిగే దారిలో గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్ళు పోసి రోడ్డుపై దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేయించారు. రోడ్డు శుద్ధి కార్యక్రమాలను గ్రామ సర్పంచ్ సక్కరం అశోక్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు