Wednesday, September 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస

భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇవ్వాలి: వ్యకాస

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఉపాధి కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా అర్హులైన వృద్ధులందరికీ పింఛన్లు ఇవ్వాలని, శ్రీ ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు చింతల నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి నందిపేట భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు రాములు, రాధాకృష్ణ, కలమండల సాయిలు, చిన్న రవి, చిక్కుడు సాయిలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -