
నవతెలంగాణ – నెల్లికుదురు
ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీని ఓడించండి అని సీపీఐ ఎంఎల్ న్యూ డమోక్రసీ తోరూర్ డివిజన్ కార్యదర్శి, ఉడుగుల లింగన్న అన్నారు. మండలంలోని తండా గ్రామంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ మోకాళ్ళ మురళీ కృష్ణను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో భగ్న తండ గ్రామంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి కామ్రేడ్ మోకాళ్ళ మురళీకృష్ణ కుండ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరినట్లు తెలిపారు. దేశంలో ఆర్ఎస్ఎస్ మతోన్మాద- బీజేపీ ప్రభుత్వం పౌర ప్రజాస్వామిక హక్కులను అణిచి వేస్తూ ఫాసిస్టు పాలనను కొనసాగిస్తూ దేశంలోని ఖనిజ సంపదను భూములను కార్పొరేట్ సంస్థలకు కట్ట బెట్టటానికి చట్ట సవరణలు తీసుకొస్తుంద ని అన్నారు. తామిచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా. కాలయాపన చేస్తున్న. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న .ప్రజా ఉద్యమాలను. ప్రజాస్వామిక వాదులను క్రూరమైన నిర్బంధ చట్టాలను ప్రయోగించి అనిచివేస్తూ. హిందుత్వ. మతోన్మాద ఫాసిస్టు పాలనను కొనసాగిస్తుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. అనునిత్యం ప్రజల కోసం ప్రజా సమస్యల సాధన కోసం. పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే సీపీఐ ఎంఎల్ డెమోక్రసీ పార్టీ అభ్యర్థి మోకాళ్ళ మురళి కృష్ణ గారి కుండ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, ఉద్యమ కారులను బలపరచాల ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు ఇరుగు నాగన్న రవి వీరన్న మంగమ్మ సోనీ దూల తదితరులు పాల్గొన్నారు.