అంగరంగ వైభవంగా సాగిన శ్రీ కారుకొండ సడలమ్మ జాతర భూపతిపూర్- అన్నారం శనివారం తో జాతర ముగిసింది. 11 రోజులు జరిగిన కారుకొండసడలమ్మ జాతర కారుకొండ సడలమ్మ దేవతలు వన ప్రవేశం చేయడంతో ఆఖరి ఘట్టం ముగిసింది.. చివరి రోజు కూడా భక్తులు భారీగానే తరలివచ్చారు. చివరి రోజున కూడా చాలామంది ప్రముఖులు కారుకొండ సడలమను దర్శించుకున్నారు. భక్తులు రోడ్ల పైన కూర్చుని ఉండగా వారిపై నుండి కారుకొండ సడలమ్మ వనదేవత నడుచుకుంటా వెళ్తే వారికి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఆదివాసి పూజారులు వాయిద్యాలతో ఆదివాసి సాంప్రదాయం ప్రకారం ఆదివాసి సంప్రదాయాల తో వన ప్రవేశం చేయించారు. పూజారులు ఎట్టి కృష్ణారావు, ఎట్టి మహేష్, భుజంగారావు, వెంకన్న, మల్లయ్య, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదర్శ యూత్ అధ్యక్షులు పాయం కళ్యాణ్, తాటి నవీన్, ఎట్టి నవీన్, దాట్ల నవీన్ జాతర క్రీడలు వీరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ బడే రాంబాబు, తల్లడి లక్ష్మయ్య, తాటి మల్లయ్య, సిద్దపేట రమేష్ బచ్చలి తరుణ్, తల్లడి రాజు, బడే రాందాస్, ఎట్టి వెంకన్న, వడ్డలు గ్రామ పెద్దలు దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా, ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సడలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. చివరి రోజున సడలమ్మ దొంతోని గుట్టకు సాగనంపారు. ఈ కార్యక్రమానికి మానుకోట ఎంపీ అభ్యర్థి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, మేడారం మాజీ ఉత్సవ కమిటీ అరెం లచ్చు పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, నాయకులు గుమ్మడి సోమయ్య, కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తుడుం దెబ్బ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రముఖులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.