దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.202.56 కోట్ల ఆదా :
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల సంక్షేమాన్ని కాపాడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని ఆదా చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణాత్మక నిర్ణయాలు మరోసారి ఫలితాలను ఇచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈమేరకు మంగళవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో వానాకాలం 2025-26 సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 78,916 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,80,187 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న నిల్వలను వినూత్న ఈ-వేలం విధానంలో విక్రయించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.202.56 కోట్లు ఆదా అయిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం భరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. నాఫెడ్ ద్వారా మొక్కజొన్నను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.
191 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకం
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వ్యవసాయశాఖ 191 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ (ఎనుమాముల) వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలకవర్గానికి చైర్‌పర్సన్‌గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్‌పర్సన్‌గా బండి జనార్ధన్‌ను నియమించినట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ – వేలం విధానంతో ఖరీఫ్ మొక్కజొన్న విక్రయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



