ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులుగా సలీం, రాము 

నవతెలంగాణ- చేర్యాల: సిద్దిపేటజిల్లాలోనిచేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం చేర్యాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా మొహమ్మద్ సలీం పాషా, ఉపాధ్యక్షులుగా ఆలేటి రవి, కొయ్యడ సంజీవులు, ప్రధాన కార్యదర్శిగా బిజ్జ రాము, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ వహీద్ అంజద్, కోశాధికారిగా జిల్లా వెంకటేశం, సంయుక్త కార్యదర్శిలు గా, యేల శ్రీనివాస్, ఆతిన మధు, కార్యవర్గ సభ్యులుగా నవజీవన్, జీడికంటి సుధాకర్, తాడెం వెంకట స్వామి, సాముల పల్లి రాజు, దువ్వల మల్లేష్, సలహా దారులు ఆడెపు మధు, మొయిన్ అతర్ ఉస్మాని లను ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మొహమ్మద్ సలీం  మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
Spread the love