జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడాకారిని దీపకు సత్కారం

నవతెలంగాణ – నవీపేట్
మండలం కేంద్రంలోని దర్యాపూర్ కు చెందిన మానికొల్ల కళావతి, బాబు రెండవ కుమార్తె దీప జాతీయస్థాయిలో సాఫ్ట్ బాల్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందడంతో దుర్గ యూత్ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు గురువారం మేమెంటో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోశెట్టి, సాయిబాబా గౌడ్, పోసాని ఉపాధ్యాయులు సురేష్ లు మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుండి దళిత, నిరుపేద కుటుంబంలో పుట్టిన దీప జాతీయ స్థాయిలో క్రీడాకారిణిగా గుర్తింపు పొందడం గ్రామస్తులందరికీ గర్వకారణమని అన్నారు. కులం, పేదరికం ఎదుగుదలకు  అడ్డు కాదని దీప నిరూపించిందని ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని కోరారు. భవిష్యత్తులో ఆమెకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు బీహార్ రాష్ట్రానికి వెళ్లేందుకు ఖర్చుల నిమిత్తం జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో 5000, బిడి దాస్ 5000, ఉపాధ్యాయులు సురేష్ 2000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారు. విద్యార్థిని దీప తల్లిదండ్రులను సన్మానించారు. డాక్టరేట్ సాధించిన వ్యాపారవేత్త బీడీ దాస్ చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడుతూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో లోకం నర్సయ్య, సూరిబాబు, సురేష్, పోసాని, దేవరాజ్, దుర్గా యూత్ సభ్యులు గోపి, వినోద్, కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love