Friday, May 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతిఏటా ఓకే విధమైన పనులు

ప్రతిఏటా ఓకే విధమైన పనులు

- Advertisement -

ఈజీఎస్ పనుల ఎంపికలో అధికారుల నిర్లక్ష్యం
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలంలో ప్రతిఏటా ఒకే విధమైన పనులు చేపడుతున్నారు తప్పా.. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టడం లేదు.ఉపాధిహామీ చేపట్టే పనులపై అధికారుల కనీసం అవగాహన కల్పించడం లేదు.దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రెండు,మూడు రకాల పనులు చేపడుతూ.. కాలం వెళ్లదీస్తున్నారు. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టడం లేదని మండల రైతులు వాపోతున్నారు.

266 పనులు చేసే అవకాశం..
జాతీయ ఉపాధిహామీ పథకంలో నిర్దేశించిన విధం గా 266 రకాల పనులు చేపట్టే అవకాశం ఉంది. రైతులకు అవగాహన కల్పించక పోవడంతో కేవలం రెండుమూడు రకాల పనులకు మించి పనులు చేపట్టడం లేదు. దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. కేవలం అడవుల్లో గుంతలు తియడం,చెరువుల్లో పూడికతీత,రోడ్లకు ఇరువైపులా గుంతలు తవ్వి మొక్కలు నాటడం వంటి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం మండలంలోని ఆయా గ్రామాల్లో చేరువు పూడిక తీత పనులు చేపడుతున్నారు.

5,324 యాక్టివ్ జాబ్ కార్డులు..
మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలలో 8,495 జాబ్ కార్డులు ఉండగా.. వాటిలో దాదాపు 4,524 జాబ్ కార్డులు యాక్టివ్ గా ఉన్నాయి.మొత్తం కూలీల సంఖ్య 18,873 మంది ఉన్నారు.ఈఏడాది 2026-27 సం వత్సరానికి దాదాపు ఒక్కలక్ష పని దినాలు కల్పించాలని లక్ష్యం ఉంది. ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో కూలీలు ఉపాధి పనులకు ఆసక్తి చూపడం లేదు. 1700 మంది కూలీలు మాత్రమే పనులకు వెళ్తున్నారు.

మచ్చుకు కొన్ని పనులు..
వర్మీ కంపోస్ట్, గుంతలు,పంట నూర్పిడి కల్లాలు,వ్యవసాయ పొలంలో రోడ్లు వేయడం,భూ ఉపరితలం నీటి కుంటలు,కొత్త,సేద్యపు బావుల తవ్వకం, వర్మీ కంపోస్ట్ ఫీట్లు, కొత్తగా పంట కాలువలు,ఉమ్మడి భూములలో పశు వుల నీటి కోసం కుంటల నిర్మాణం,ఫారం నిర్మా ణాలు,కందకలు తవ్వడం,చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, శ్మశాన వాటికలో స్థలాలను అభివృద్ధి చేయడం వంటి పలు రకాల చేపట్టే పనులున్నాయి. గ్రామసభలు నిర్వహించే సమయంలో తూతూ మంత్రంగా పనులను ఎంపిక చేస్తున్నారు. రైతులకు గ్రామాల ప్రజలకు ఉపయోగపడే పనులు గుర్తించడం లేదు.ఇప్పటికైనా అధికారులు స్పందిం చి రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -