నవతెలంగాణ-తుంగతుర్తి
వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. బంధుమిత్రులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పనిచేస్తున్న చర్లపల్లి సోమయ్య(69) వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారు.తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం,తుంగతుర్తి సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు,తహసిల్దార్ దయానందం,స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ లు మృతుడి పార్థివదేహానికి నివాళులు అర్పించి,దహన సంస్కారాల నిమిత్తం రూ.10 వేల సొసైటీ తరఫున అందజేసినట్లు తెలిపారు.వడదెబ్బకు గురై మరణించిన వారికి ప్రభుత్వం అందించే నాలుగు లక్షల ఎక్స్గ్రేషియాను అందించాలని సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు,తాసిల్దార్,ఎస్ఐలకు సూచించారు.
వడదెబ్బతో హమాలి మృతి.. ఆర్థిక సాయం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



