సందేశ్ కాళీ సంఘటన నిందితులను ఉరితీయాలి

– భాధితులకు న్యాయం చేయాలి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో సందేశ్ కాళీ ఘటనకు నిరసనగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి బస్టాప్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ తీసి బస్టాప్ వద్ద  టిఎంసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.  ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బచ్చన బోయిన శివ మాట్లాడుతూ సందేశాఖాలీ ప్రాంతంలోని మహిళలు జిహాదీ గ్రూపు ద్వారా లైంగికంగా దోపిడీకి గురవుతున్నారు మరియు వారి గుర్తింపును ఉల్లంఘిస్తున్నారు బాధిత మహిళల్లో చాలా మంది అత్యంత వెనుకబడిన, షెడ్యూల్డ్ తరగతులకు చెందిన వారన్నారు. సందేశ్ ఖాలీ స్త్రీద్వేషానికి వ్యతిరేకంగా నిలబడటం మన బాధ్యతన్నారు. గత కొన్ని రోజులుగా దేశం అంతా చర్చనీయాశమైన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులు, షాజహాన్ షేక్, అతని అనుచరులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని సందేశ్ ఖాళీ ఒక మారు మూల గిరిజన తెగ ప్రాంతంలోని ప్రజల పై దాడులు, అక్రమ భూ కబ్జాలు, మహిళలపైన లైంగిక దాదులు చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందనిఅన్నారు. అలాగే  వారు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో మహిళలను ఒక లైంగిక యంత్రాలుగా చూస్తూ, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు మహిళలను వివిధ రకాలుగా వేధిస్తూ పార్టీ కార్యాలయాలకు రప్పించుకొని మరి హత్యాచారాలు చేయడం యావత్ సమాజం సిగ్గుతో తలదించుకునే దుస్ధితి అన్నారు. మమతా బెనర్జీ ఒక మహిళ ముఖ్యమంత్రి అయినటువంటి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేది సిగ్గుచేటు అని కొన్ని సంవత్సరాల తరబడి మహిళలను, పేద ప్రజలను పీడిస్తున్న అధికార పార్టీ నాయకుల పైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించకపోవడం వెనుక ఉన్న కారణం ఏమిటని ప్రశ్నించారు. ఈ సంఘటనను యావత్ సమాజం ప్రశ్నిస్తుందని, సందేశాఖాలీ సంఘటన పైన వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సందేశాఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అసహ్యకరమైన మనస్తత్వానికి బలైన మహిళలకు న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో రానున్న రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రెసిడెంట్ సాయి, సెక్రెటరీ అమృత్ చారి,ఉపాధ్యక్షులు రాకేష్, హరికృష్ణ,ప్రమోద్,నాగరాజు,సమీర్,అజయ్,మహర్షి,అక్షయ్ ,మోహన్, సతీష్, మహేష్ విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love