ప్రతి ఇంట్లో సంక్రాంతి శోభ వెల్లివిరియాలి

– కార్పొరేటర్‌ కొలుకుల జగన్‌
– చైతన్య విద్యానికేతన్‌ పాఠశాలలో సంక్రాంతి రంగోలి ముగ్గుల పోటీలు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇంట్లో సంక్రాంతి శోభ వెళ్లి విరియాలని ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉందని జగద్గిరిగుట్ట డివిజన్‌ కార్పొరేటర్‌ కొలుకుల జగన్‌ అన్నారు. మకర సంక్రాంతి పర్వదినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధి మగ్దుంనగర్‌లోని చైతన్య విద్యా నికేతన్‌ హై స్కూల్‌ ఆవరణలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాఠశాల చైర్మెన్‌, కరస్పాండెంట్‌, ట్రస్మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, ట్రస్మా మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు, శివరాత్రి యాదగిరి ఆధ్వర్యంలో రంగోలి ముగ్గుల పోటీలను నిర్వహించారు. అలాగే తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా పాఠశాల ఆవరణలో భోగిపండ్లను చిన్నారులకు పోసి చిన్నారులనూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్‌ కొలుకుల జగన్‌తో పాటు జగద్గిరిగుట్ట ఎస్సై శంకర్‌లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, యువతులు, విద్యార్థుల్లోని ప్రతిభ, సృజనాత్మక వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అనంతరం ముగ్గు ల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు పారితోషి కాలను, బహుమతులను వారు అందజేశారు. మహిళల విభాగంలో ప్రథమ బహుమతి టి.జ్యోతి రూ.4000 నగదు, రెండవ బహుమతి వి.స్వాతి రూ.2000 నగదు, తృతీయ బహుమతి-కె.. సౌజన్యకు రూ.1000, నగదు తోపాటు విద్యార్థుల విభాగంలో -ప్రథమ బహుమతి-జుహి రూ.500, రెండవ బహుమతి వి.అక్షయ (పదవ తరగతి) రూ. 300, తతీయ బహుమతి భావన(ఎనిమిద వ తరగతి)కి రూ.200, నగదు బహుమ తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్‌ మంగ దేవి, శివరాత్రి నిఖిల్‌, ప్రిన్సిపాల్‌ శివరాత్రి సాయితేజ, వైస్‌ ప్రిన్సిపాల్‌ సరిత కిశోర్‌, ఇన్‌చార్జి గీత ఉపాధ్యాయులు సుధ, అఖిల్‌ దాస్‌, రాణి, నవత, సవిత, ప్రియాంక, కవిత తదితరులు పాల్గొన్నారు.

Spread the love