11 నుండి 23 వరకు కుష్టు వ్యాధి నిర్మూలన సర్వే చేపట్టాలి: వైధ్యాధికారి సంతోష్ కుమార్

నవతెలంగాణ – డిచ్ పల్లి

ఈనెల 11 నుండి 23 వరకు కుష్టు వ్యాధి నిర్మూలన సర్వే కార్యక్రమం ఉంటుందని, ప్రతి ఒక్క ఆశ కార్యకర్త ఇంటింటికి తిరుగుతూ కుష్టు వ్యాధి సర్వే చేయాలని, ఇంటింటికి తిరిగి పురుషులకు, స్త్రీలకు స్పర్శ లేని చెమట రాని రాగి రంగు మచ్చలు గుర్తించాలని, అనుమానస్పద కేసులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని గుర్తించి పై అధికారులకు వారి పేర్లు విన్నవించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సంతోష్ కుమార్ అన్నారు.సోమవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు 11 నుండి 23 వరకు కుష్టు వ్యాధి నిర్మూలన సర్వే కార్యక్రమం ను పకడ్బందీగా ఆశ కార్యకర్త ఇంటింటికి తిరుగుతూ కుష్టు వ్యాధి సర్వే చేయాలని ఆదేశించారు. వేసవి కాలం దృశ్య త్రాగునీరు పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. కాచి వడపోసిన నీటిని మాత్రమే త్రాగాలని ప్రజలలో అవగాహన పెంచాలని ఆశా కార్యకర్తలను సూచించారు.  ప్రతి గర్భిణీ స్త్రీ ని 12 వారాలలోపు నమోదు చేయాలని, 12 వారాల లోపు నమోదు చేసినట్లయితే గుర్తించవచ్చని అందుమూలంగా గర్భిణీ స్త్రీకి సరైన న్యాయం జరుగుతుందని వివరించారు .ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ఉమారాణి, ఆరోగ్య కార్యకర్తలు వెంకటరెడ్డి ,ఆనంద్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love