దుర్గామాత షెడ్డు నిర్మాణానికి సర్పంచ్ విరాళం

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో దుర్గామాత షెడ్డు నిర్మాణానికి సర్పంచ్ సరిన్ 31116 రూపాయలను శ్రీరాం యూత్ సభ్యులకు సోమవారం అందించారు. ఈ సందర్భంగా దుర్గామాత ఆలయ 12వ వార్షికోత్సవ సందర్భంగా తన వంతు సహకారం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ యూత్ సభ్యులు గంగాధర్, సుమన్, ప్రనిల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love