నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో బుధవారం ఉపాధి హామీ కూలీలతో గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ సమావేశమయ్యారని కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎండలు బాగా పెరిగినాయి అని అన్నారు. కావున ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఉపాధి హామీ పని ప్రదేశానికి చేరుకొవాలని సూచించారు. పని సమయంలో ప్రతి ఒక్కరూ ఎండ నుండి రక్షణకై కాటన్ టవల్ తలకు కట్టుకోవాలని అన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల పౌడర్ నీటిలో కలుపుకొని తరచూ మీరు ఎక్కువ తాగాలని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బల బారి నుండి తప్పుకునే విధంగా కొన్ని సూచనలు చేసినారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్. బి. అనిల్ కుమార్, ఉపాధి హామీ జిపి కారోబర్ ఎం. గంగారం, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలతో సమావేశమైన సర్పంచ్
- Advertisement -
- Advertisement -



