పండుగ చీరల పంపిణీలో సర్పంచ్ రాజ్ కుమార్ పటేల్

నవతెలంగాణ- మద్నూర్:
ఆడపడుచులకు అన్ని పండుగల కంటే ఆనందాన్ని కలిగించే పండుగ బతుకమ్మ పండుగని డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పర్గా గ్రామ సర్పంచ్ రాజకుమార్ పటేల్ తెలిపారు ఆ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం నాడు బతకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కోసం మహిళలకు చీరలు పంపిణీ చేయడం సంతోషకరమని సర్పంచ్ తెలిపారు ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సతీష్ గ్రామ అంగన్వాడీ టీచర్ మంగ్లీ ఆ గ్రామ  మాజీ సర్పంచ్ విట్టల్ రావు పంచాయతీ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు
Spread the love