Thursday, June 4, 2026
E-PAPER
Homeజిల్లాలుఎమ్మెల్యే చేతుల మీదుగా సర్పంచ్ కి ‘దళిత రత్న’ అవార్డు

ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్పంచ్ కి ‘దళిత రత్న’ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలం అంబేద్కర్ నగర్ గ్రామ సర్పంచ్ చీటూరి రాజుకు దళితరత్న అవార్డు లభించింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేతుల మీదుగా అవార్డు అందజేసి శాలువాతో చీటూరి రాజును సన్మానించారు అంబేద్కర్ నగర్ గ్రామ సర్పంచ్ చిటూరి రాజు అనేక సందర్భాల్లో దళితుల హక్కుల సాధన, సామాజిక న్యాయం, ప్రజల్లో చైతన్యం, కోసం తన వంతు పలు సేవలందించడంతో ఈ అవార్డు లభించినట్లు చిటూరి రాజు తెలిపారుహైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖుల చేతుల మీదుగా చిట్టూరి రాజు అవార్డును స్వీకరించారు. అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కలిసి మర్యాదపూర్వకంగా కలవగా, ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు ఈసందర్భంగా చిట్టూరి రాజు మాట్లాడుతూ, ‘‘దళిత రత్న అవార్డు నా వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదనీ, సమాజ సేవకు లభించిన గుర్తింపు అన్నారు ఈ అవార్డుతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానన్నారు చిట్టూరి రాజుకు దళిత రత్న అవార్డు లభించడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -