నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలో గల హనుమాన్ ఆలయానికి చెందిన భూమికి దారికి అడ్డుపడుతున్నారని అదే విధంగా ఆలయ భూమి దాదాపు రెండు ఎకరాల వరకు భూ కబ్జాకు గురి అయింది అని ఆ గ్రామ సర్పంచ్ మహేష్ కుమార్ తో పాటు గ్రామస్తులు కలిసి శుక్రవారం మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఆ గ్రామంలోని సర్వే నెంబర్ 37/ అ లో 8.33 ఎకరాలు అదేవిధంగా 37/ ఆ లో 3.20 ఎకరాలు మొత్తం 12 – 13 ఎకరాల భూమి ఉందని ఈ భూమి మందిరానికి చెందడానికి గ్రామస్తులు పది సంవత్సరాలు పోరాడి 2018లో జడ్జిమెంట్ గా విజయం సాధించారని ఆలయ భూమికి వెళ్లడానికి దారిలో అడ్డుపడుతున్నారని దారి అడ్డుపడడమే కాకుండా రెండు ఎకరాల వరకు అక్రమ కబ్జాకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని తాసిల్దారుకు అందజేసిన వినతి పత్రంలో సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
కబ్జా గురి అయిన భూమిని పరిష్కరించాలని తాసిల్దార్ కు సర్పంచ్ వినతి పత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



