ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

నవతెలంగాణ-వీణవంక
సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధక్షుడు దొమ్మాటి రాజమల్లు గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే చల్లూరు గ్రామంలో సర్వాయిపాపన్నగౌడ్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పైడిమల్ల శ్రీనివాస్, నల్లగోని రమేష్, దూలం సమ్మయ్య, బత్తిని నరేష్, బాలసాని సంపత్, చేపూరి మొగళి, బొంగోని ఎల్లయ్య, పూదరి అనిల్, చేపూరి రాజు, సదానందం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love