Saturday, May 16, 2026
E-PAPER
Homeఆటలుసెమీస్‌‌లో 
సాత్విక్‌ ‌జోడీ

సెమీస్‌‌లో 
సాత్విక్‌ ‌జోడీ

- Advertisement -

క్వార్టర్స్‌‌లో జపాన్‌ ‌షట్లర్లపై గెలుపు
సింధు, లక్ష్యసేన్‌‌కు భంగపాటు
థాయ్‌‌లాండ్‌ ఓపెన్‌ ‌సూపర్‌ 500

‌బ్యాంకాక్‌ (‌థాయ్‌‌లాండ్‌) : భారత బ్యాడ్మింటన్‌ ‌డబుల్స్‌ ‌స్టార్స్‌ ‌సాత్విక్‌‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ ‌శెట్టి జోడీ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ‌సూపర్‌ 500 ‌టోర్నమెంట్‌‌లో సెమీఫైనల్‌‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌‌ఫైన్లలో సాత్విక్, చిరాగ్‌ ‌జోడీ వరుస గేముల్లో గెలుపొందారు. టాప్‌ ‌సీడ్‌ ‌సాత్విక్‌,చిరాగ్‌‌లు 21-12, 21-13తో 41 నిమిషాల్లోనే సెమీఫైనల్‌ ‌బెర్త్‌ ‌దక్కించుకున్నారు. ఆరో సీడ్‌ ‌జపాన్‌ ‌షట్లర్లు టకుమి, యుచిలు భారత జోడీకి పోటీ ఇవ్వటంలో తేలిపోయారు. తొలి గేమ్‌‌ను 10-0తో దూకుడుగా మొదలెట్టిన సాత్విక్‌, చిరాగ్‌‌లు అదే జోరు కొనసాగించారు. 14-10తో జపాన్ షట్లర్లు మెరుగైనా.. మనోళ్లు వెనక్కి తగ్గలేదు. వరుస పాయింట్లతో 21-12తో తొలి గేమ్‌‌ను గెల్చుకున్నారు. రెండో గేమ్‌‌లో టకుమి, యుచిలు ఆరంభం నుంచి పోరాడే ప్రయత్నం చేశారు. 11-9తో విరామ సమయానికి ముందంజ వేసి టాప్‌ ‌సీడ్‌ ‌జోడీ.. 16-10తో ఆధిక్యంలో నిలిచింది. వరుసగా ఐదు పాయింట్లు సాధించిన సాత్విక్‌, చిరాగ్‌‌లు 21-13తో రెండో గేమ్‌‌తో పాటు సెమీఫైనల్‌ ‌బెర్త్‌‌ను కైవసం చేసుకున్నారు.

​సింధు, లక్ష్యసేన్‌‌కు నిరాశ
మహిళల సింగిల్స్‌‌లో ఆరో సీడ్‌ ‌పి.వి సింధు పరాజయం పాలైంది. క్వార్టర్‌‌ఫైనల్లో టాప్‌ ‌సీడ్ అకానె యమగూచి (జపాన్‌) చేతిలో 21-19, 18-21, 15-21తో మూడు గేముల మ్యాచ్‌‌లో పోరాడి ఓడింది. తొలి గేమ్‌‌లో నెగ్గి ఆకట్టుకున్న సింధు.. వరుసగా రెండు గేముల్లో నిరాశపరిచింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌‌లో అకానె యమగూచి 2-1తో గెలుపొంది సెమీస్‌‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌‌లో యువ షట్లర్‌ ‌లక్ష్యసేన్‌ సైతం నిరాశపరిచాడు. రెండో సీడ్‌ ‌కునాల్‌‌విట్‌ (‌థాయ్‌‌లాండ్‌) 21-19, 21-16తో లక్ష్యసేన్‌‌పై వరుస గేముల్లో గెలుపొందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -