నవతెలంగాణ- రాజంపేట్
ఆడపిల్లను రక్షించు ఆడపిల్లను చదివించు కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొండాపూర్ క్లస్టర్ లోని స్త్రీ శక్తి గ్రామ సంఘం లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి మహిళా సాధికార కేంద్ర సిబ్బంది మహిళలకు మహిళా హక్కుల గురించి, బాల్యవివాహాలు, జండర్ అంశాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శారదా తులసి సౌందర్య గ్రామ సంఘం అధ్యక్షులు, సంఘ లీడర్లు, సీసీ భాగయ్య, వివో ఏలు తదితరులు పాల్గొన్నారు.