ఎస్‌బీఐ శాఖ మార్పు

హైదరాబాద్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సైఫాబాద్‌ పరిదిలోని తన బెల్లా విస్టాలోని శాఖను వేరే భవనంలోకి మార్చినట్లు తెలిపింది. ఈ శాఖను రాజ్‌ భవన్‌ రోడ్‌లోని బెల్వెడర్‌ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. దీన్ని ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సిజిఎం అమిత్‌ జింగ్రాన్‌ లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు దేబాశిష్‌ మిత్రా, ఆర్‌ బాలానంద్‌, రోహిత్‌ కుమార్‌, సివి రఘురామ్‌ పాల్గొన్నారు.

Spread the love