సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్ బీఐ పాటించాలి: సీపీఐ(ఎం)

– ఎన్నికల బాండ్ల వివరాలు ఎలక్షన్ కమిషన్ కి వెంటనే ఇవ్వాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
నవతెలంగాణ – కరీంనగర్ 
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, గత నాలుగేళ్లలో అమ్మిన బాండ్లు వాటిని కొన్న వారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి 6లోపు ఇవ్వాలని ఎస్బిఐ ని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, ఎస్బిఐ ఛైర్మన్ కావాలని వివరాలు ఇవ్వకుండా మోడీ అనుకూల ఎస్బిఐ వైఖరి రాజ్యాంగానికి విరుద్ధమని వెంటనే సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎన్నికల బాండ్ల వివరాలు ఎలక్షన్ కమిషన్ కు వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. మోడీ అనుకూల ఎస్బిఐ నివసిస్తూ వెంటనే ఎన్నికల బాల వివరాలు ప్రకటించాలని సీపీఐ(ఎం) పార్టీ పొలిటి బ్యూరో పిలుపుమేరకు కరీంనగర్ లోని ఎస్బిఐ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాక్య రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 15 సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చిందని సుప్రీం తీర్పు ప్రకారం ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మూడు వారాల్లోగా అనగా మార్చి 6లోపు ఎలక్షన్ కమిషన్ కు వ్వాలని గడువు విధించింది. కానీ బీజేపీకి అనుకూలంగా కావాలని సమాచారం ఇవ్వడానికి మూడు నెలలు గడువు పడుతుందని సుప్రీంకోర్టును కోరిందంటే ఎన్నికల ముందు ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వెళ్లాయో తెలిస్తే బీజేపీకి నష్టం జరుగుతుందని భావించి, జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని కోరిందన్నారు. అప్పటికి సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎస్బిఐ వైఖరి తెలుస్తుందన్నారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకే ఎస్బిఐ పూర్తిగా సహకరిస్తుందని, ప్రభుత్వ బ్యాంకును ఆదర్శంగా నిర్వహించాల్సింది పోయి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బిఐ అని తన కార్యకలాపాలన్నీ డిజిటల్ పద్ధతిలో జరుగుతాయని సమాచారం కావాలంటే ఒక క్లిక్ తో వస్తుందని ఇదంతా ప్రజలకు తెలుసని, కానీ న్యాయస్థానాన్ని ప్రజలను పచ్చి అబద్దాలతో ఎస్బిఐ మోసం చేస్తుందన్నారు. తాను విక్రయించిన ఎన్నికల బాలల వివరాలు సమర్పించేందుకు మీనవేషాలు లెక్కిస్తుందన్నారు. అందుకు సమయం పడుతుందని నమ్మించే ప్రయత్నం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలోగ్గుగతుందనేది స్పష్టం అవుతుదన్నారు. ఎన్నికల బాండ్లను ఎవరు కొనుగోలు చేశారు, ఏ రాజకీయ పార్టీకి దానిని విరాళంగా అందజేశారు, అనే విషయాలు తెలుసుకోవాలని దేశం యావత్తు ఎదురుచూస్తున్నారు. 2019 నుండి 22,217 బాండ్లను ఎస్బిఐ జారీ చేసిందని కొన్ని బాండ్లను రాజకీయ పార్టీలు నగదు రూపంలోకి మార్చుకున్నాయని బీజేపీకి సుమారు రూ.7000 కోట్లు బాండ్ల రూపంలో వచ్చాయని, ఇది పూర్తిగా క్విడ్ ప్రోకో గా ఉందన్నారు. బాల నిర్వాహనకు ఐటీ  ఐటీ సిస్టంను అభివృద్ధి చేయడానికి ఎస్బిఐ సుమారు రూ.60 లక్షలు ఖర్చు చేసిందని, దాని నిర్వహణ కోసం మరో రూ.89 లక్షలు ఖర్చు చేసిందని, అలాంటి డిజిటల్ టెక్నాలజీని వాడుకోకుండా మీన వేషాలు లెక్కిస్తుందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా పనిచేసినప్పుడే వ్యవస్థలు సరిగా ఉంటాయన్నారు. ఎస్బిఐ చైర్మన్ ను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల బాండ్లవివరాలు వెంటనే భారత ఎన్నికల కమిషన్ కు వ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుంద రెడ్డి, వర్ణవెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు యు శ్రీనివాస్, ఎడ్ల రమేష్ నరేష్ పటేల్, జిల్లా నాయకులు కోనేటి నాగమణి, గడ్డం శ్రీకాంత్ తిప్పారపు సురేష్,పున్నం రవి, కాంపెళ్లి అరవింద్,సాయి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love