ఎస్‌సీఈయూ రాష్ట్ర మహాసభ విజయవంతం

– 43 మందితో నూతన కమిటీ ఎన్నిక :యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
నవతెలంగాణ-గోదావరిఖని
గోదావరిఖని కేంద్రంగా సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీ స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభ రెండ్రోజులపాటు విజయవంతంగా జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 43 మందితో ఎస్‌సీఈయూ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్టు రాజారెడ్డి తెలిపారు. 18 మందిని రాష్ట్ర ఆఫీస్‌ బెరర్స్‌గా, 25 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు చెప్పారు. మరోసారి గౌరవ అధ్య క్షులుగా ఈ. రాజారావు, రాష్ట్ర అధ్యక్షునిగా తుమ్మల రాజా రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మంద నర సింహారావు, రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్ర టరీగా ఎస్‌.నాగరాజు గోపాల్‌, రాష్ట్ర ఉపాధ్య క్షులుగా బి.మధు, రాష్ట్ర కోశా ధికారిగా వై వెంకటేశ్వర్లు ఎన్నికైనట్టు వివరించారు. రామ గుండం రీజియన్‌లోని ఆర్జీ 1 నుంచి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా మెండె శ్రీనివాస్‌, కార్యదర్శులు గా మేదరి సారయ్య, ఆసరి మహేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులుగా సీహెచ్‌ వేణుగోపాల్‌ రెడ్డి, ఎస్కే గౌస్‌, దాసరి సురేష్‌, ఆరెపల్లి రాజమౌళి, అన్నం శ్రీనివాస్‌, పి.శ్రీని వాస రావు, మల్యాల శ్యామలను, ఆర్జీ 3 నుంచి ముగ్గురు రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌గా, నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. ఈ మహా సభలో సింగరేణి కార్మికుల సమస్యలపై నివే దిక ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించామ న్నారు. నాయకులు మేదరి సారయ్య, మెండే శ్రీనివాస్‌, ఆసరి మహేష్‌, ఎస్కే గౌస్‌, ఆరె పల్లి రాజమౌళి, దాసరి సురేష్‌, ఎం. శ్రీహరి, ఐ.రమేష్‌, జి.శంకర్‌, ఇ.సతీష్‌ కుమార్‌, జే మల్లేష్‌, ఎ.రాజయ్య తదితరులున్నారు.

Spread the love