నవతెలంగాణ శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని మెట్ పల్లి గ్రామంలో వరి పంట పొలాలను కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కృషివిజ్ఞాన శాస్త్రవేత్త మాట్లాడుతూ, వర్షాకాలం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులలో వరి పంట పొలాలు పిలకలు వేసే దశలో ఉన్నందున మొగిపురుగు ఆశించకుండా ఉండేందుకు ఎకరానికి 10 కిలోల కార్బో ప్యూరాన్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా కార్పాఫ్ హైడ్రాక్లోరైడ్ రెండు లీటర్ల నీటిని కలిపి పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. వరి పొలం చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు తప్పనిసరిగాఎకరానికి 6-8 అంగార్షక బుట్టలు పెట్టుకొని పురుగు ఉధృతిని గమనించాలన్నారు. ఈ దశలో మొగిపురుగు ఆశించినట్లైతే కారాఫీ హై థ్రాక్లోరైడ్ మరియు షిప్రోనిల్ మిశ్రమం 5 కిలోలు లేదా 5కిలోలు ఎకరాకు (ఎక్షోటికా) ఇసుకలో కలిపి చల్లుకోవాలని ఆయన సూచించారు. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంత్రానిలిప్రోల్ మరియు లార్డసైహాలోనిన్ ల మిశ్రమం 80 మిల్లి లీటర్ల ఎకరాకు పిచికారి చేసువాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి జి. శ్రీనివాస్, ఏఈఓ బి రాజు కుమార్, రైతుబాధు సమితి గ్రామ కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి,రైతులు పాల్గొన్నారు.