రెండో ఏఎన్‌ఎల మానవహారంఎమ్మెల్యేలకు వినతులు

– ఏఎన్‌ఎం నియామక నోటిఫికేషన్‌ రద్దుకు డిమాండ్‌
నవతెలంగాణ- విలేకరులు
నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. వివిధ కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ.. ప్రభుత్వం ఏఎన్‌ఎంల నియామకం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, ఇది ఇప్పటివరకు పని చేస్తున్న వారికి గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలను ఫణంగా పెట్టి రెండో ఏఎన్‌ఎంలు కరోనా సమయంలో విధులు నిర్వర్తించారని చెప్పారు. గతంలో రోస్టర్‌ విధానంలో పరీక్ష రాసి రెండో ఏఎన్‌ఎంల నియామకం చేపట్టారని, మళ్లీ వారిని పరీక్ష రాయాలనడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయాలని, పాతవారికి వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకు ంటే 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటియుసీ,సీపీఐ,ఏఐవైఎఫ్‌ నాయకులు పాల్గొన్నా రు. మంచిర్యాలలో కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యుల ర్‌ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోమాస ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు.నల్లగొండ జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి గడియారం సెంటర్‌ వరకు భారీ ర్యాలీ, నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ వద్ద సెకండ్‌ ఏఎన్‌ఎంలు నిరసన తెలిపి మానవహారం నిర్వహించారు. అర్వపల్లి మండలకేంద్రంలో సెకండ్‌ ఏఎన్‌ఎంలు జనగాం,సూర్యాపేట రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. కోదాడ పట్టణంలోని రంగాథియేటర్‌ వద్ద ఏఐటీయూసీ ఆద్వర్యంలో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు.మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేప ట్టారు. నోటిఫికేషన్‌ రద్దు చేసి, కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎం లను పర్మినెంట్‌ చేయాలని తెలంగాణ మెడికల్‌ అం డ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఫస్యుద్దీన్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలయంలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

Spread the love