పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యు జి సి ఎన్ ఈ టి జూన్ – 2025 సందర్బంగా అండర్ సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు లో ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యు జి సి ఎన్ ఈ టి (UGC NET) జూన్ – 2025 కోసం జిల్లా లోని నిజామాబాదు డివిజన్ లోని పరీక్ష కేంద్రాo వద్ద తేది 25-06-2025 నుండి తేది 29-06-2025 వరకు ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మల్టి షిఫ్ట్ ప్రకారం పరీక్షలు గలవు. ఏవి ఎంటర్ ప్రైజెస్, మున్నూరు కాపు సంఘము, అర్సపల్లి బై పాస్ రోడ్డు , నిజామాబాదు లో పరీక్షా కేంద్రాo వద్ద ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిషేధిత ఆదేశాలు జారీ చేశారు. కావున నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తు గా నిరోధించాలనే ఉద్దేశ్యంతో అండర్ సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలులో ఉంటుంది అని తెలియచేసారు. అండర్ సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమి కూడరాదు. నిషేదిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగవద్దు. పరీక్షా కేంద్రాo పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్‌లను తేది: 25-06-2025 నుండి తేది: 29-06-2025 వరకు (ఉదయం 07:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు) మూసివేయాలి. నిషేధిత ఉత్తర్వులు తేది 25-06-2025 నుండి తేది 29-06-2025 వరకు (ఉదయం 07:00 నుండి సాయంత్రం 6:00 వరకు) అమలులో ఉంటాయి అని తెలియజేశారు.
రేపటి నుంచి నిజామాబాద్ లో అండర్ సెక్షన్ 163 అమలు
- Advertisement -
- Advertisement -



