
నవతెలంగాణ-గోవిందరావుపేట : కష్టంలో దుఃఖంలో ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులు గా ఆదుకునే సీతక్క గెలుపు ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడపక సుధాకర్ అన్నారు. శుక్రవారం మండలం లోనీ చలువాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షులు పెద్దాపురం మొగిలి ఆధ్వర్యంలో గ్రామ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గణపాక సుధాకర్ హాజరై మాట్లాడారు. ప్రజా సేవనే పరమావధిగా నమ్ముకున్న సీతక్క గెలుపు ఖాయం అని, కొందరు అధికార పార్టీ నేతలు కావాలనే సీతక్క పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అన్ని వర్గాల వారికి పట్టాలు అందించి, వారికి పంట రుణాలు అందించి రైతన్నను ఆడుకివడమే సీతక్క లక్ష్యం అని అన్నారు. ఒక ప్రతి పక్ష ఎమ్మేల్యేగా సీతక్క ములుగు ప్రాంత ప్రజల ప్రతి సమస్యపై అసెంబ్లీలో తన గళం వినిపించారు అని, అధికార పార్టీ ఆగడాలపై పోరాటం చేశారని, దొరల పెత్తనంపై ఉద్యమ పంజా విసిరిన సీతక్క ని కావాలనే లక్ష్యంగా చేసుకొని నయా నయీం గ్యాంగును ములుగులో దింపి ఒక గిరిజన ఆదివాసీ ఎమ్మేల్యే కోసం వందల కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు అని అన్నారు. సీతక్క ములుగు ప్రజలకు చేసిన మోసం ఏంటి? అధికార పార్టీ నేతల్లాగా అక్రమ ఇసుక రవాణా చేసిందా, అక్రమ ఎర్రమట్టి మైనింగ్ చేసిందా, భూములు ఆక్రమించుకుని అక్రమ ఆస్తులు సంపాదించిందా ఏ అవినీతి చేయని ఒకే ఒక ఎమ్మేల్యే సీతక్క ని, ఏ అవినీతి మచ్చ లేని సీతక్క పై కొందరు అధికార పార్టీ నేతలు కావాలనే బురద జల్లుతున్నారని, అన్నదమ్ముల్ల కలిసి ఉంటున్న గిరిజన, గిరిజనేతరుల మధ్య కావాలని చిచ్చు రాజేస్తు, సీతక్క పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సీతక్క అన్ని వర్గాల ప్రజలకు పట్టాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని, అందరికీ సాగు పట్టాలు, పోడు పట్టాలు అందించాలని అసెంబ్లీలో మాట్లాడిన ఘనత సీతక్క దే అని అన్నారు. గత పదేండ్ల పాలనలో బీజేపీ, బి.ఆర్.ఎస్.పార్టీ నేతలు పట్టాలు ఎందుకు అందించలేదు, పదేండ్లు అధికారంలో ఉన్నపుడు పట్టాలు చేయలేని వారు ఇప్పుడు కొత్తగా పట్టాలు చేస్తారా ప్రజలారా ఒకసారి ఆలోచించండి పండించిన పంటను అమ్మలేనీ స్థితికి తీసుకువచ్చిన బి.ఆర్.ఎస్.పార్టీకి ఓటు ద్వారా బుద్ది చెప్పి, బి.ఆర్.ఎస్.పార్టీని గద్దె దించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విద్యార్థుల భవిష్యత్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు సాధికారత, రైతులకు పంట రుణమాఫి, కొత్త పంట రుణాలు, క్వింటాలుకు 500/- రూపాయల బోనస్, రైతులకు, రైతు కూలీలకు పంట పెట్టుబడికి రైతు బంధు అందిస్తుందని అన్నారు.ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి గత పదేండ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉండి మనల్ని ఎంత నాశనం చేసిందో ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. దొరల ఘడిని బద్దలు కొట్టాలంటే మన ఆయుధం ఓటు మాత్రమే అని, పేదల నేస్తం అయిన హస్తం గుర్తుకు ఓటు వేసి మన అభివృద్ధిని మనమే సంపాదించుకుందాం అని అన్నారు. చల్వాయి భూములను కూడా 5th బెటాలియన్ కోసం చిన్న, సన్నకారు రైతుల భూములు గుంజుకున్నారు అని, సీతక్క గారు భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ చాపల ఉమాదేవి, కాసర్ల రాంబాబు, మేకల సుదర్శన్, సాయిబాబు తదితరులుపాల్గొన్నారు.