బాన్సువాడ కాంగ్రెస్ లో సెగలు

– టికెట్ రాక పార్టీ ఇన్ ఛార్జ్ కాసుల  ఆత్మహత్యాయత్నం
– భారీగా తరలివచ్చిన కార్యకర్తలు 
నవతెలంగాణ- నసురుల్లాబాద్: కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా టికెట్ వస్తుందని ఆశించి  భంగపడ్డడంతో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్  కాసుల బాలరాజు బుధవారం  ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. 2009లో స్థానికేతులకు బాన్సువాడ టికెట్ ఇవ్వడం ఓడిపోవడంతో బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను బాన్సువాడ నియోజకవర్గ కార్యకర్తలకు రథసారథిగా మారి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న తనకు కాకుండా వివిధ పార్టీలు మారుతూ ఇతర స్థానికేతరులకు టికెట్ ఇవ్వడం ప్రతిపక్ష నాయకులు కొందరు హేళనగా మాట్లాడటం పై మనస్థాపానికి గురై  తన స్వగృహంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బుధవారం ఉదయం  ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం అందరికి తెలిసిందే. పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డ తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కాసుల బాలరాజు క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన అనుచరులు, నాయకులు, కార్యకర్తలు హుటాహుటిన ఆయనను బాన్సువాడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తు. కాసుల బాలరాజు పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు వారి వెంట వీధి పార్టీల నాయకులు కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. బాన్సువాడ లో కాంగ్రెస్ నేత కాసుల బాలరాజ్ ఆత్మహత్య వేతనం చేసుకున్న సమాచారం నియోజకవర్గంలో సమాచారం వెళ్లడంతో వివిధ మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా బాన్సువాడకు తరలివచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.
Spread the love