రాష్ట్రస్థాయి ఎంఎల్ బి  బేస్ బాల్ పోటీలకు ధర్మారం బి విద్యార్థినిల ఎంపిక..

నవతెలంగాణ- డిచ్ పల్లి:
డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బి తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల సుద్ద పల్లి లో నిర్వహించిన  జిల్లాస్థాయి బేస్ బాల్  పోటీలలో మంచి ప్రతిబను కనబరిన ఈ. వర్షిని ఎన్. నందన, ఐశ్వర్య, లాస్య, శ్రీ నిత్య ,సుధీర రాష్ట్రస్థాయికీ  ఎంపిక కావడం జరిగిందని ధర్మారం బి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సంగీత మంగళవారం అభినందించారు. హైదరాబాద్ లోని  ఉస్మానియా యూనివర్సిటీ లో 12 నుoచి 14 వరకు జరిగే రాష్ట్రస్థాయి బెస్ బాల్ పోటీలలో వీరు  పాల్గొనున్నారు. వీరిని స్కూల్ ప్రిన్సిపల్ సంగీత, ఫిజికల్ డైరెక్టర్ నీరజా రెడ్డి, పిఈటీ జోష్ణ, హౌస్ మాస్టర్ లత, మమత , సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
Spread the love