సీపీఐ(ఎం) సీనియర్ సభ్యురాలు ఆదెమ్మ మృతి…

– పార్టీ పతాకం కప్పి నివాళులు అర్పించిన జిల్లా కార్యదర్శి కనకయ్య….

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం పండు వారిగూడెం కు చెందిన సీపీఐ(ఎం) సీనియర్ సభ్యురాలు సీసం ఆదెమ్మ(90) సోమవారం వయోభారంతో అనారోగ్యానికి గురై మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆమె మృతదేహం పై పార్టీ పతాకం కప్పి నివాళులు అర్పించారు. ముందు తరం ఉద్యమ వారసులను కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసారు. ఆదెమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కార్యదర్శి రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య,జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి, అభ్యర్ధి అర్జున్ రావు పాల్గొన్నారు.
Spread the love