నెలరోజుల్లోనే ఏడుగురు చిన్నారులు మృతి..అంతుచిక్కని మరణాలు

నవతెలంగాణ – కామారెడ్ది: కామారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా శిశు మరణాలు సంచలనంగా మారాయి. నెలరోజుల వ్యవధిలోనే ఏకంగా ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ శిశువుల మృతికి కారణాలు అంతుచిక్కడం లేదు. మరణించిన వారందరూ నాలుగు నెలల లోపు చిన్నారులే. పైగా వైద్యులు పరీక్షిస్తుండగానే చిన్నారుల ఊపిరి ఆగిపోవడం స్థానిక ప్రజల్లో గుబులు రేకెత్తిస్తోంది. చిన్నారులు మృతి చెందడం పట్ల కామారెడ్డి జిల్లాకు చెందిన వైద్యులు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా వైద్య అధికారులు రాష్ట్ర అధికారులకు వైద్యులు సమాచారమిచ్చారు.

Spread the love