కొలనులకు కొలువుగా మారిన శంకర్ భవన్..

నవతెలంగాణ – కంటేశ్వర్

కులానులకు కొలువుగా శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ మారిందని తగినంత మోరాన్ని వేయించే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ నగర కమిటీ అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సందర్శనలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల శంకర్ భవన్ స్కూల్ నందు వర్షం నీరు నిలువ ఉండకుంట, మొరం వెయ్యాలని నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా నగర ఉపాధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు సమస్యల నిలయంగా మారుతున్నాయని అన్నారు. అలాగే నిన్న ఒక్కరోజు ఒక్క పూట కురిసిన వర్షానికే శంకర్ భవన్ స్కూల్ గ్రౌండ్ చెరువుకు తక్కువ కొలనుకు ఎక్కువ అన్నట్టు నీరు నిండిపోయి ఉన్నడటం వలన విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అదే విధంగా ఇంకా వర్షాలు పూర్తి స్థాయిలో పడకముందే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయ్యారు అవుతుందన్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు స్పందించి స్కూల్ అవరణలో నీరు నిలువ ఉండకుండా మట్టి వేపియ్యలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నగర నాయకులు విశాల్, రాహుల్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love