
మహాశివరాత్రి సందర్భంగా మండల వ్యాప్తంగా శుక్రవారం శివాలయాల్లో శివనామ స్మరణ మారు మోగింది. తెల్లవారుజాము నుండే ప్రజలు పెద్ద ఎత్తున మంగళ స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి శివాలయాలకు పోటెత్తారు. హర హర శంభో అంటూ జనులు శివ నామాన్ని పదేపదే స్మరించారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ రాజకీయ నాయకులు సామాజికవేత్తలు పలు బ్యానర్లను కట్టారు. శివాలయాల్లో ఈరోజు తెల్లవారుజాము వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని జాగారాలు కొనసాగుతాయని అర్చక స్వాములు తెలిపారు. ప్రజలకు తీర్థప్రసాదాలను కందలను కొందరు పంచారు పలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు పెద్దలు శివునికి పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకున్నారు పట్టు వస్త్రాలు కూడా అందించారు శివపార్వతుల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు కూడా అందించారు. జాగారం చేస్తున్న వారి కొరకై సినిమా హాలు తెల్లవారులు ఆటలను నిర్వహించనున్నారు.