Friday, May 29, 2026
E-PAPER
Homeఆటలుసినర్‌కు షాక్‌

సినర్‌కు షాక్‌

- Advertisement -

రెండో రౌండ్లో అనూహ్య ఓటమి
అర్జెంటీనా చిన్నోడు జువాన్‌ సంచలనం
ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2026

పారిస్‌ (ఫ్రాన్స్‌) : వరుసగా ఐదు ఏటీపీ మాస్టర్స్‌ 1000 టైటిల్స్‌ సొంతం. ప్రపంచ నం.1 ర్యాంక్‌. టైటిల్‌ వేటలో ప్రత్యర్థి కార్లోస్‌ అల్కరాస్‌ గాయంతో దూరం. ఇక ఫ్రెంచ్‌ ఓపెన్‌లో జానిక్‌ సినర్‌ (ఇటలీ)కి ఎదురులేదు అనుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఒక్క సెట్‌, సింగిల్‌ సర్వ్‌ కోల్పోకుండా తొలి రౌండ్లో అలవోక విజయం సాధించిన జానిక్‌ సినర్‌కు ఫైనల్‌ వరకు పోటీ నల్లేరుమీద నడకే అనిపించింది. కానీ రెండో రౌండ్లోనే టాప్‌ సీడ్‌ ఆటగాడికి అర్జెంటీనా ఆటగాడు చెక్‌ పెట్టాడు. ఐదు సెట్ల పాటు సాగిన మారథాన్‌ మ్యాచ్‌లో సినర్‌పై జువాన్‌ మాన్యూవెల్‌ సంచలన విజయం సాధించాడు. 6-3, 6-3తో సినర్‌ వరుస సెట్లలో గెలుపొందాడు. కానీ మూడో సెట్లో సినర్‌కు ఊహించని పోటీ ఎదురైంది. 7-5, 6-1, 6-1తో అర్జెంటీనా ఆటగాడు అద్భుతమే చేశాడు. ఏకంగా ఎనిమిది సార్లు సినర్‌ సర్వ్‌ను బ్రేక్‌ చేసిన జువాన్‌.. వరల్డ్‌ నం.1ను చిత్తుగా ఓడించాడు. 14 ఏస్‌లు, 5 బ్రేక్‌ పాయింట్లతో జువాన్‌ మెరువగా.. 5 ఏస్‌లు, 7 డబుల్‌ ఫాల్ట్స్, ఐదు బ్రేక్‌ పాయింట్లకే సినర్‌ పరిమితం అయ్యాడు. పాయింట్ల పరంగా 119-139తో సినర్‌ తేలిపోయాడు. అనూహ్య ఓటమితో సినర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ వేటకు రెండో రౌండ్లోనే బ్రేక్‌ పడింది. రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)6-4, 6-2, 6-2తో వరుస సెట్లలో చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు థామస్‌పై విజయం సాధించాడు. 15వ సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ 6-3, 6-2, 6-4తో సెర్బియా ఆటగాడు హమద్‌పై వరుస సెట్లలో గెలుపొంది మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -