
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని సీఎల్ఎఫ్ సంస్థ జిల్లా అధికారి డి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో మహిళ సంఘ సభ్యులతో అర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఎల్ఎఫ్ జిల్లా అధికారి డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కష్టపడి సంపా దించిన వాటికి విలువను, గుర్తింపును తీసుకవస్తుందన్నా రు. భవిష్యత్ ప్రణాళికలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆర్థిక వ్యవహారాలు, రిజర్వ్ బ్యాంక్ గుర్తించిన ఆర్థిక సంస్థల్లో పొదుపు చేసుకోవాలని సూచించారు. ఈ ఆర్థిక సంస్థలలో ఆర్థిక మోసాలు జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మెన్ ద్వారా పరిష్కారం పొందవచ్చు అన్నారు.అలాగే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు పొదుపు ఎక్కడ చేసుకోవాలి. మన డబ్బుకు భద్రత పై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ మోసాలు, ఆన్ లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కౌన్సిలర్స్ బాలకృష్ణ,, పర్వయ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు.