
మండల కేంద్రంలో యాదవ సంఘం అధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవులు చిన్నారులతో ప్రత్యేక నృత్యాలను చేయించారు. యువకులు, చిన్నారులు గుంజను ఎక్కడం జరిగింది. అనంతరం గ్రామంలో ప్రధాన విదుల గుండా శోభాయాత్ర చేపట్టారు. అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యాదవులు సంఘం సభ్యులు, యువకులు చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు.